- పాత కమిటీ ఇచ్చిన డెవలప్మెంట్ కి కొత్త కమిటీ అడ్డు
- వీ.ఐ.పీల వ్యవహారం వీధి రౌడీలతో కొట్టాలనే తీరు
- అక్రమాలు బయటపెట్టేందుకా..లేక బ్లాక్ మెయిల్ కా?
- జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 1 ప్రైం ప్రాపర్టీ పై జరుగుతున్నదేంటి?
- నమ్మకం కోల్పోతున్నబడాబాబుల సొసైటీ ..?
జూబ్లీహిల్స్ కో -ఆపరేటివ్ హౌజింగ్ సోసైటీ పాలకమండలి కక్షలతో బిల్డర్స్ బలవుతున్నారు.పాత కమిటీ చేసిన ఒప్పందాలను లీగల్ గా ఎదుర్కొనలేక..కక్షలకు,కుట్రలకు అజ్యం పోస్తున్నారు.గత ఎగ్జిక్యూటివ్ కమిటీ లో అధ్యక్షుడు నరేంద్రచౌదరి, సెక్రెటరీ హన్మంతరావు చేసిన డెవలప్మెంట్ అగ్రిమెంట్ కి మోకాలడ్డుతున్నారు. వివాదస్పదమైన సొసైటీ భూములు. వందల కోట్ల వ్యవహారం.. ప్రైం ఏరియా కావడంతో ఎంతకైనా బరితెగించేందుకు పాలకమండలి సభ్యులు సిద్ధపడుతున్నారు. గత కమిటీ సభ్యులు ఏనుగులను తిన్నానరనే ఆరోపణలు ఉంటే.. ఈ పాలక మండలి ఏనుగలతో పాటు పీనుగలను తినే రకంగా ఉన్నారనే సభ్యుల ఆరోపణలతో అపవాదును మూటగట్టుకుంటున్నారు.
6వేల గజాల లీజులో తిరకాసు
జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 1 లో సొసైటికి చెందిన భూమి సుమారు రెండెకరాలు ఉంటుంది. సుమారు 2 వేల గజాల పార్క్ ప్రాంతాన్ని కబ్జా చేసి 20 యేళ్లుగా నర్సరీ నడిపిస్తున్నారు.చిరంజివి బ్లడ్ బ్యాంకు నుంచి మొదలుకుని ఈ 6వేల గజాలు క్లినిక్ కోసం ఉపయోగించాలి. అయితే ఇప్పటికే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉండటంతో.. కార్పోరేట్ కార్యాలయాలు నిర్వహించేలా సొసైటికి 40 శాతం, బిల్డర్ కి 60 శాతం ఉండేలా మంతెనా రియల్టీ ఎల్ఎల్పీ తో రిజిస్ట్రర్ అగ్రిమెంట్ చేసుకున్నారు.అంతకు ముందు అదే భూమిని మరో సభ్యునికి కేటాయించారని కోర్టులో కేసులు వేశారు.ఆ వ్యక్తికి వేరే విధంగా లబ్ది చేకూరేలా బిల్డరే చూసుకోవాలి. అనుమతులతో పాటు అన్నిఅంశాలు డెవలపర్ కే ముడిపడి ఉండటంతో పర్సెంటేజ్ విషయం సొసైటీకి తగ్గిందని తెలుస్తోంది. రెండు కోట్ల రూపాయలు సొసైటీకి డిపాజిట్ చేశారు. 40 లక్షలు డెవలప్మెంట్ అగ్రిమెంట్ కి ప్రభుత్వానికి చెల్లించారు.ఇదంతా లీగల్ గా సొసైటీ రూల్స్ ప్రకారం పాలక మండలి సభ్యుల అమోదంతోనే జరిగింది. అయితే ఆ తర్వాత వచ్చిన పాలక మండలీ తిరకాసు పెడుతోంది. అప్పటి ఒప్పందంలో అక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు తమ వాట ఏంటని బ్లాక్ మెయిల్ చేసేలా వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తమకి భూమి అప్పగించినా..పొజిషన్ లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని అవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సరీ నడిపే వ్యక్తి తాను 20యేళ్ల నుంచి ఉన్నానని కోర్టు నుంచి స్టేటస్ కో తెచ్చుకున్నారు.
విఐపీల నుంచి వీధి రౌడీల వరకు..
గజం భూమి 2 లక్షలకు పలికే జూబ్లీహిల్స్ ఎరియాలో 500ల గజాలు తగ్గకుండా ఉన్నఇళ్ల యజమానులు,సెలబ్రెటీలు ఉంటున్నఏరియా..ఎదైనా సమస్య వస్తే..సొసైటీలో పెద్ద మనుషుల మధ్య పరిష్కారం కావాలి.కాని రౌడీషీటర్స్ ని రంగంలోకి దింపుతున్నారు. సొసైటీ జాగా అంటూ బోర్డులు పాతి.. బాలరాజ్ అనే రౌడీని కాపలా పెట్టారు. ఇదే విషయం సీపీ సి.వి. ఆనంద్ వరకు వెళ్లింది.ఎవరైతే పొజిషన్ లో ఉన్నారో వారే ఉండాలని అదేశాలు ఇచ్చారు.డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఉన్నందున వారికి ఆ భూమికి హక్కులు ఉన్నాయని తెలిపినట్లు సమాచారం.
లీగల్ గా ఎందుకు వెళ్లడం లేదు
గత పాలక మండలి ఏదైనా తప్పు చేస్తే..న్యాయపరంగా కోర్టులో కేసు వేసి అగ్రిమెంట్ ని రద్దు చేయవచ్చు.లేదా జనరల్ బాడీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా..దాని పై అగ్రిమెంట్ హోల్డర్ కోర్టుకు వెళ్లవచ్చుకాని ఏది కాకుండా రౌడీలతో స్థలాలను అక్రమించాలనే ఉద్దేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎవరు ఎలాంటి మంచి పనులు చేసినా అది వ్యక్తిగతంగా కాకుండా సొసైటీ సభ్యులకు మేలు జరిగేలా ఉండాలని సభ్యులు కోరుకుంటున్నారు.