హైదరాబాద్,తొలివెలుగు: జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ట్రిబ్యునల్లో చుక్కెదురైంది. సెక్రెటరీ మురళీ ముకుందని కొనసాగించ వద్దని ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానం చేయగా..అది చట్టవిరుద్ధమని గతంలో ట్రిబ్యునల్ లో ముకుంద స్టే తెచ్చుకున్నారు.అయినా వినకుండా కమిటీ అధ్యక్షుడు, టీవీ5 మేనేజింగ్ డైరెక్టర్ బి.రవీంద్రనాథ్ చౌదరి హైకోర్టుకు వెళ్లి వెకేట్ చేయించారు.
అటు టీవీ5, ఇటు ఎన్టీవీ గొడవల మధ్యలో నలిగిపోయిన మురళీ ముకుందకు ఇప్పుడు ఊరట లభించింది. ఓ వైపు.. అక్రమంగా కేసులు బనాయించి తీవ్ర ఇబ్బందులు పెట్టిన మీడియా సంస్థల ఓనర్ ల ఆధిపత్యం.. చివరికి నిజాయితీ, న్యాయం ముందు ఓడిపోక తప్పలేదని మురళి ముకుంద అభిప్రాయపడ్డారు. అటు..ఈ విషయంపై సింగిల్ బెంచ్ స్టే ని ఎత్తి వేసిన హైకోర్టు 15 రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపాలని ట్రిబ్యునల్ కి ఆదేశించింది.