తెలంగాణ హైకోర్టు జడ్జి వైఎస్ సునీతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేనికైనా లిమిట్స్ ఉండాలన్నారు. కాగా, ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ సందర్భంగా జడ్జి ఆమె పై ఆగ్రహించారు.
అయితే అవినాశ్ రెడ్డి తరపు లాయర్లు, వైఎస్ సునీత న్యాయవాదుల మధ్య ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఇక అందరి వాదనలను ఈ రోజే వింటామని న్యాయమూర్తి అన్నారు. ఈ సమయంలోనే సునీత మధ్యలో కల్పించుకొని అవినాశ్ రెడ్డి లాయర్ కు ఎంత సమయం ఇచ్చారో అంతే సమయం తమకు ఇవ్వాలని కోరారు.
దీంతో జడ్జి ఆమె పై సీరియస్ అయ్యారు.వాదనలు జరుగతున్న సమయంలో మధ్యలో కల్పించుకొని మాట్లాడడం సరికాదన్నారు. మరో వైపు అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పై ఉదయం పదిన్నర నుంచి వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. లంచ్ విరామం తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నాయి. అయితే సిట్ పోలీసులకు వాచ్ మెన్ రంగన్న ఇచ్చిన స్టేట్ మెంట్ చాలా కీలకమని హైకోర్టు స్పష్టం చేసింది.
వాచ్ మెన్ రంగన్న స్టేట్ మెంట్ లో ఏం చెప్పాడో వాటిని ధర్మాసనం ముందు ప్రొడ్యూస్ చేయాలని కోరింది. మరోవైపు అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాదులు కీలక సాక్షి రంగన్న స్టేట్ మెంట్ పట్టించుకోకుండా సీబీఐ పోలీసులు వదిలేశారని కోర్టుకు తెలియజేశారు. అయితే ముందస్తు బెయిల్ పై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.