భారతదేశం పుట్టుక ఎంత పాతదో… అయోధ్య వివాదం అంత పాతదని, అత్యంత పెద్ద బాధ్యత తమపై పెట్టారని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. హిందువులు ఇక్కడే రాముడు పుట్టాడని నమ్ముతారని, అలాగే ముస్లింలు కూడా మెఘల్ చక్రవర్తి బాబర్ 16వ శాతాబ్ధంలో ఖాళీ స్థలంలో మసీదును కట్టించారని నమ్ముతున్నారని అభిప్రాయపడింది. సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ప్రకారం డిసెంబర్ 23, 1949వరకు అక్కడ ముస్లింలు ప్రార్థనలు జరిగేవని, కానీ హిందువులు ఆ రోజు కొన్ని విగ్రహాలను పెట్టి స్థలాన్ని ఆక్రమించారని పేర్కొంది. అప్పట్లో అలహబాద్ కోర్టు 4304 పేజీల తీర్పును ఇచ్చిందని, ఆ తీర్పును సుప్రీంలో సవాలు చేశారు. అలహబాద్ హైకోర్టు ఆ భూమిని మూడు వాటాలు వేసింది. హిందువులకు, ముస్లింలతో పాటు అక్కడ ప్రార్థనలు నిర్వహిస్తున్న నిర్మోహి అఖాడాలకు సమానంగా పంచింది.
1856-57లో మెదటిసారి ఆ ప్రాంతంలో మతకల్లోలాలు జరిగాయి. దాంతో ఆ స్థలం మధ్యలో అరడుగుల గోడ కట్టారు. లోపల భాగంలో ముస్లింల ప్రార్థనకు, బయట హిందువులకు కేటాయించారు. ఈ బయటి భాగంలోనే సీతా రసోయి, రాంచాబుత్ర ఇంకా అనేక విగ్రహలుంటాయి. అయితే, ఇలా విభజించటం వల్ల వివాదాలు సద్దుమణగకపోగా మరింత ఎక్కువయ్యాయి. ఈ రాంచాబుత్రలోనే మందిర నిర్మాణానికి సుదీర్ఘ కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంతో దశాబ్ధాల తరబడి ఈ కేసులు నడుస్తూనే ఉన్నాయి.
అయితే, ఇది మతానికి సంబంధించిన వివాదంగా కాకుండా… భూ వివాదంగా చూస్తున్నామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అందుకే హిందువులకు కాకుండా రాంలల్లాగా పిలవబడే రాముని విగ్రహలకే ఆ భూమిని కేటాయించింది. 1870లో ఫైజాబాద్‌లో పి. కార్నేగి అనే అధికారి ఇచ్చిన మ్యాప్ రిపోర్టు ముఖ్య ఆధారం అయింది. యోధులకు జెరూసలేం ఎలాగో… ముస్లింలకు మక్కా ఎలాగో… హిందువులకు అయోధ్య అంతటి ముఖ్యమైన పవిత్ర స్థలం అని వ్యాఖ్యానించారు.
రాముడు అయోధ్యలోనే పుట్టినట్లు ముస్లింలు కూడా ఒప్పుకున్నారని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 1889 పురావాస్తు శాఖ రిపోర్టు ప్రకారం పురాతనమైన రామజన్మభూమి ఉన్న చోటే మెఘల్ చక్రవర్తి బాబర్ మసీదును కట్టాడని పేర్కొంది. ఇలా అనేక పురావాస్తు శాఖ రిపోర్టులలో రామజన్మభూమిలోనే బాబ్రీ మసీదును కట్టారని ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.
అయితే, డిసెంబర్ 6, 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత సరైంది కాదని వ్యాఖ్యానించిన ధర్మాసనం ఆఖరికి ఈ భూమి రామునికే దక్కాలని తీర్పునిచ్చింది.
మొత్తం 1045పేజీల తీర్పును రాసింది ధర్మాసనం. ఆ తీర్పు కాపీ యాధావిధిగా తొలివెలుగులో….