కూతురు జాహ్నవి మెహతతో కలిసి సినీ నటి జుహీచావ్లా దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆమె పుట్టిన రోజు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రాలను అన్నింటినీ కలిపి వీడియో రూపంలో ఇన్ స్టా గ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఇందులో జాహ్నవి పుట్టినప్పటి నుంచి ఐపీఎల్ వేలం వరకు కూతురు జాహ్నవితో ఆమెకు ఉన్న తీపిగుర్తులను ఇందులో షేర్ చేశారు. ఈ వీడియో జాహ్నవిని ఎత్తుకున్న ఫోటోతో మొదలై ఇటీవల కెమెరాకు ఇద్దరూ కలిసి ఫోజ్ ఇచ్చిన ఫోటోల వరకు ఎన్నో జ్ఞాపకాలను అందులో యాడ్ చేశారు.
వీడియోను షేర్ చేస్తూ ‘ జాహ్నవి చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి క్రికెట్ ను చూసేది కాదు. కానీ ఇటీవల ఆమె క్రికెట్ చూడటం మొదలు పెట్టింది. కామెంటేటర్స్ చెబుతున్న విషయాలను శ్రద్ధగా వింటోంది. ఆటకు సంబంధించిన పలు విషయాలను ఆమె నేర్చుకుంటున్నారు” అని క్యాప్షన్ పెట్టారు.
‘ జాహ్నవికి 12 ఏండ్లు ఉన్నప్పుడు మా ఫ్యామిలీ మొత్తం హాలీడే ట్రిప్ కు వెళ్లాము. ఆ సమయంలో హోటల్ లో కాఫీ టేబుల్ పై ఓ బుక్ ఉంది. దానిలో ప్రపంచంలోని అందరు క్రికెటర్ల జీవిత చరిత్రలు ఉన్నాయి. 12 ఏండ్ల అమ్మాయి ఆ పుస్తకాన్ని అంత ఆసక్తిగా చదవడం ఆశ్చర్యాన్ని కలిగించిది. ఇన్నెండ్ల తర్వాత కూడా ఇప్పుడు ఆమెకు ఆటపై మరింత ఆసక్తి పెరుగుతోంది. ఓ తల్లిగా జాహ్నవిని చూసి ఆనంద పడుతున్నాను” అని రాసుకొచ్చారు.