తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వేడుకల నేపథ్యంలో రాజ్‌భవన్ రోడ్డు, వీవీ విగ్రహం, ఖైరతాబాద్, నిరంకారి, పాత సైఫాబాద్ పీఎస్, రవీంద్రభారతి జంక్షన్, బషీర్‌బాగ్ జంక్షన్, ఏఆర్ పెట్రోల్ బంక్, నాంపల్లి రోడ్డు, తాజ్ ఐలాండ్ రోడ్లపై ఆంక్షలు విధిస్తున్నట్టు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ ను సజావుగా క్రమబద్ధీకరించేందుకు రోడ్డు మార్గాలను మళ్లించినట్టు ప్రకటించారు.
ఎంజే మార్కెట్ నుంచి వాహనాలను పబ్లిక్ గార్డెన్ వైపు అనుమతించకుండా.. తాజ్ ఐలాండ్, ఆసిఫ్ నగర్, రెడ్ హిల్స్, అయోధ్య హోటల్, లక్డికాపూల్ వైపు మళ్లించనున్నట్టు తెలిపారు. నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి పబ్లిక్ గార్డెన్ ను ట్రాఫిక్ గన్ పౌండ్రీ, అబిడ్స్, బీజేఆర్ విగ్రహం, బషీర్ బాగ్ ఫ్లైఓవర్ ద్వారా చాపెల్ రోడ్ టీ జంక్షన్ మీదుగా మళ్లించనున్నారు.
నిరంకారి భవన్-ఖైరతాబాద్, రవీంద్ర భారతి వైపుకు వాహనాలను అనుమతించకుండా.. పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, సెక్రటేరియట్ రోడ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంబేద్కర్ విగ్రహం, లిబర్టీ భషీర్ బాగ్, అబిడ్స్ వైపు వెళ్లే విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. హైదర్ గూడ, కింగ్ కోఠి, బీజేఆర్ విగ్రహం, పీసీఆర్, పబ్లిక్ గార్డెన్ వైపు వెళ్లే వాహనాలను.. బషీర్‌బాగ్ జంక్షన్, లిబర్టీ, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, ఇక్బాల్ మినార్, ఓల్డ్ పీఎస్ సైఫాబాద్, లక్డికాపూల్ బ్రిడ్జ్, బీజేఆర్ విగ్రహం, అబిడ్స్ వైపు మళ్లించనున్నారు.
ఆదర్శ్ నగర్ వద్ద లిబర్టీ రోడ్డు, తెలుగు తల్లి ఫ్లైఓవర్, తెలుగు తల్లి, ఎన్టీఆర్ మార్గ్, లిబర్టీ వైపు నుంచి వచ్చే వాహనాలను ఆదర్శ్ నగర్ రోడ్డు, పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్ వైపు మళ్లిస్తారు. ట్యాంక్ బండ్ నుంచి రవీంద్ర భారతి వైపు వచ్చే వాహనాలను.. ఇక్బాల్ మినార్, టెలిఫోన్ భవన్ రోడ్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్, లక్డికాపూల్ బ్రిడ్జి వైపు మళ్లించనున్నారు. సుజాత స్కూల్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు వాహనాల రాకపోకలను నిషేధిస్తూ.. బీజేఆర్ విగ్రహం వైపున్న ఏఆర్ పెట్రోల్ బంక్ వైపుకు వెళ్లే విధంగా చర్యలు చర్యలు చేపట్టారు.