ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు. గుంటూరులో డాక్టర్ పై జరిగిన దాడికి నిరసనగా విజయవాడలో ఓపి సేవలు బహిష్కరించారు. ప్రజలకు సేవలందిస్తున్న తమపై నిరంతరం దాడులు చేయడం సబబేనా అని ప్రశ్నింస్తున్నారు.
కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి సేవలు చేశామని గుర్తు చేస్తున్నారు. చట్టాలు ఉన్నా.. వాటిని అధికారులు అమలు చేయడం లేదని.. మొక్కుబడి చర్యల వలన తమకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శిక్షలు కఠినంగా ఉంటేనే.. దాడులు ఆగుతాయని అన్నారు. తమకు భద్రత ఉంటుందని ప్రభుత్వం భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఓపీ సేవలు మాత్రమే నిలిపివేశామని.. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోతే.. రేపు అత్యవసర సేవలు కూడా బహిష్కరిస్తామని జూడాలు హెచ్చరించారు.