కొన్ని సినిమాలు ఒకరు వద్దు అనుకుంటే మరొకరికి వెళ్లి వారికి మంచి హిట్ దొరుకుతుంది. అలా ఎన్టీఆర్ చాలా సినిమాలను దూరం చేసుకున్నారు అని అంటారు. మంచి కథలు విన్నా సరే కథల విషయంలో సరైన అవగాహన లేకపోవడంతో సినిమాలను వదులుకున్నాడు. అయినా కొన్ని మంచి హిట్స్ తో టాలీవుడ్ లో ఇప్పుడు దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్ మిస్ చేసుకున్న ఒక సినిమా గురించి చూద్దాం.
అదే అతనొక్కడే సినిమా… ఈ సినిమాను ముందు సురేందర్ రెడ్డి… జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ వెంటనే నో అనడంతో ఏం చేయాలో అర్ధం కాక కళ్యాణ్ రామ్ కు కథ చెప్పారు. ఆ కథ కళ్యాణ్ రామ్ కంటే కూడా హరికృష్ణకు బాగా నచ్చింది. వెంటనే కళ్యాణ్ రామ్ ను చేయాలని సూచించారట. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటన కూడా చాలా బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి.
ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి తో జూనియర్ ఎన్టీఆర్… అశోక్ అనే సినిమా చేసాడు. ఈ కథ విన్నప్పుడు బాగున్నా ఆ తర్వాత ఆకట్టుకోలేదు. దీనితో బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. కిక్ సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగింది. కిక్ సినిమా కథ ముందు జూనియర్ ఎన్టీఆర్ విన్నాడు. కాని వద్దు అనడంతో ఆ సినిమా రవితేజా చేసారట. ఆ తర్వాత మళ్ళీ సురేందర్ రెడ్డి తో ఊసరవెల్లి సినిమా చేసి షాక్ అయ్యాడు ఎన్టీఆర్.