నందమూరి తారక రామారావు కొడుకు చైతన్య రధ సారధి నందమూరి హరికృష్ణ 64వ జయంతి నేడు. ఈ సందర్భంగా హరికృష్ణ తనయుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనవుతూ ట్వీట్ చేశారు. దీంతోపాటు హరికృష్ణ ఫోటోలు కూడా షేర్ చేశారు. ఈ అస్తిత్వం మీరు, వ్యక్తిత్వం మీరు,మొక్కవోని ధైర్యంతో కొనసాగే నేతృత్వం మీరు,ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణంమీరే అంటూ ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. మీ 64వ జయంతిన మిమ్మల్ని స్మరించుకుంటూ మిస్ యు నాన్న అంటూ చెప్పుకొచ్చారు ఎన్టీఆర్. నల్గొండ జిల్లాలో అభిమాని ఇంట్లో ఫంక్షన్ కి వెళుతుండగా హరికృష్ణ కారు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో హరికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే.
మీ 64వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ…. Miss You Nanna! pic.twitter.com/GG11AnPbIY
— Jr NTR (@tarak9999) September 2, 2020