నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి బాలకృష్ణకు ఫోన్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఆయన హెల్త్ కండీషన్ గురించి, ఆస్పత్రికి తరలించడం పట్ల అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేశారని, ఆయన కోలుకుంటున్నట్లుగా బాలయ్య జూనియర్ తో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు ఎన్టీఆర్.
ఈ నేపథ్యంలో తారకరత్న చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద నందమూరి బాలకృష్ణ, ఇతర టీడీపీ నేతలు వుండి పరిస్ధితిని పర్యవేక్షిస్తున్నారు. గుండెపోటుకు గురైన సినీనటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా నారా లోకేష్ యువగళం యాత్రలో నందమూరి తారకరత్న స్పృ తప్పిపడిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ప్రైవెట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తారకరత్నకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని.. స్టెంట్ వేశామని, ప్రస్తుతం స్పృహలోకి వచ్చినట్టు వైద్యులు వెల్లడించారు. తారక్ ఆయన కుడి, ఎడమ రక్తనాళాల్లో 95 శాతం బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ని బెంగళూరుకి తరలించాలని నిర్ణయించారు.
తారకరత్న కోలుకుంటున్నారని.. ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు బాలయ్య. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు వైద్యులతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే బాలయ్యకు జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.