సినీ ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అయితే అందులో కొంతమంది మాత్రమే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటారు. అలా ఆ ఇమేజ్ ను సాధించడం వెనుక ఎంతో కష్టం, కృషి, పట్టుదల ఉంటాయి. ఇండస్ట్రీలో ఒక హీరో సక్సెస్ అవ్వలాన్నా అడ్రస్ లేకుండా పోవాలి అన్నా…వేరే వారి ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. మరి కొంతమంది విషయంలో సొంత వాళ్లే వ్యతిరేకిస్తూ ఉంటారు. ఆస్తులు విషయం పక్కన పెడితే మనవాడే కదా అనే అభిమానం కూడా చూపించరు. అవును ఇప్పుడు మనం మాట్లాడుతుంది మరెవరి గురించో కాదు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి.
చిన్నప్పటినుంచి ఎంతో కష్టపడుతూ ఎటువంటి సహాయం లేకపోయినా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారాడు. ఎన్టీఆర్ పేరుకు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు మనవడు. కానీ ఎన్టీఆర్ ను కొంతకాలం వరకు ఆ ఫ్యామిలీలో ఎవరు చేరదీయలేదు. అందుకు కారణం హరికృష్ణ రెండవ భార్య కొడుకు ఎన్టీఆర్ కావడం.
సాయి పల్లవి వివాదంలోకి వర్మ ఎంట్రీ….ఏం జరుగుతుందో ?
ఆ తర్వాత అలా అలా కాలం గడుస్తున్న కొద్దీ సీనియర్ ఎన్టీఆర్ అర్థం చేసుకొని జూనియర్ జు చేరదీశారు. ఆ తరువాత ఎన్టీఆర్ చనిపోయాక తారక్ ను పట్టించుకున్నవారే లేరు. ఓవైపు నటుడిగా రాణించాలని పట్టుదల మరోవైపు నందమూరి ఫ్యామిలీ కి దగ్గర అవ్వాలని ఆశ ఈ రెండింటిని మనసులో పెట్టుకుని కష్టపడ్డాడట తారక్.
హీరోయిన్ విషయం లో రాజమౌళి మహేష్ ల మధ్య విబేధాలు…క్లారిటీ!!
తన తల్లిని ఎందరో ఎన్నో మాటలు అన్న ఏనాడు ఎమోషనల్ గా బయటకు వచ్చి మాట్లాడ లేదు. ఎవరితో కూడా విబేధాలు పెట్టుకోలేదు. అంతేకాదు స్టార్ హీరోగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి సైతం తన సినిమాలతో బయపెట్టాడు. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ తెలుగు ప్రజల ప్రేమాభిమానాలు పొందాడు. కానీ అప్పట్లో బాలకృష్ణ కూతురు నిశ్చితార్థం సమయంలో కూడా ఎన్టీఆర్ ను పిలిచి ఎవరూ పట్టించుకోలేదు. అప్పుడు ఆ కార్యక్రమం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు ఎన్టీఆర్.
Advertisements
ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సందర్భాలలో నందమూరి ఫ్యామిలీ అవమానించింది. కానీ ఏ రోజు కూడా ఎన్టీఆర్ బయటపడలేదు. తన నటనతో స్టార్ ఇమేజ్ ను తెచ్చుకుని ఎవరైతే వద్దు అని అనుకున్నారో వారితోనే ఎన్టీఆర్ మావాడు అనిపించుకున్నాడు. కళ్యాణ్ రామ్, బాలకృష్ణ ఇలా అందరూ కూడా ఎన్టీఆర్ ను దగ్గరికి తీసుకున్నారు. అలాగే రాజకీయ పరంగా కూడా ఎన్టీఆర్ టిడిపి పార్టీని టేకోవర్ చేయాలని కోరుకుంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.