టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఎన్టీఆర్ ను టార్గెట్ చేసిన వాళ్ళు కూడా ఆ తర్వాత ఆయన్ను అభిమానించే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఉన్న హీరోలు ఎవరూ అందుకోలేని కొన్ని ఘనతలను ఆయన అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరిగింది అనే చెప్పాలి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాను ఈ ఏడాది దసరాకు విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంచితే ఎన్టీఆర్ కు ఒక పదేళ్ళ క్రితం మాత్రం కాస్త దారుణమైన పరిస్థితి నడిచింది. శక్తి, ఊసరవెల్లి, దమ్ము, రామయ్య వస్తావయ్య, రభస సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఈ సినిమాలతో ఎన్టీఆర్ కూడా బాగా ఫీల్ అయ్యారు.
అయితే ఈ సినిమాల్లో నిర్మాతకు కాస్త లాభాలు వచ్చిన సినిమా రామయ్య వస్తావయ్య. ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు ఉండగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. అప్పటికే హరీష్ శంకర్… గబ్బర్ సింగ్ సినిమాతో మంచి హిట్ కొట్టారు. ఎన్టీఆర్ కు ఉన్న ఇమేజ్ తో ఆ సినిమా అప్పుడు 30 కోట్ల వసూళ్లు సాధించింది. దిల్ రాజు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం చెప్పారు.