సినిమాల్లో స్టార్ లు కావాలన్న సమాజంలో సెలబ్రిటీల హోదాకి చేరాలన్న హార్డ్ వర్క్, టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి.అలాంటి అదృష్టం అందరికీ కావాలి అనుకున్నప్పుడు తలుపు తట్టదు.కావున అలాంటి అదృష్టం గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా మన పని మనం చేసుకుంటూ, సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఆ అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది.ఆ వచ్చిన అదృష్టాన్ని వదలకుండా జాగ్రత్తగా వాడుకుంటే మన లక్ష్యాన్ని మనం చేరుకుంటాం.దీనికి చక్కని ఉదాహరణ రీసెంట్ గా మన తెలుగునాట ఫేమస్ అయి బిగ్ బాస్ కు వెళ్ళిన గంగవ్వ.ఇక ఇలాంటి వారు మన చుట్టూ చాలామందే ఉన్నారు.వారిని స్టార్స్ అయ్యేదాకా మనమే గుర్తించం.ఇక తాజాగా ఇలాంటి ఓ యంగ్ టాలెంట్ గురించి ఆనంద మహీంద్రా ట్వీట్ చేశారు.అంతేకాకుండా అతన్ని జూనియర్ రఫీ అని పొగిడారు.మరి ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.
కోజికోడ్ కు చెందిన సౌరవ్ కిషన్ కు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం.అతను చాలారోజులు నుండి పాటలు పాడుతూ ఆ వీడియోస్ ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్నాడు.కాని అతనికి తగిన గుర్తింపు రాలేదు.సౌరవ్ కిషన్ వాయిస్ కు లోకల్ గా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.వాళ్ళు అతన్ని చోటా రఫీ అని పిలుస్తుంటారు.తాజాగా సౌరవ్ కిషన్ పాడిన ఓ పాటను ట్విట్టర్ లో ఓ వ్యక్తి పోస్ట్ చేశారు.ఆ వీడియోకు అతి తక్కువ టైంలో కొన్ని లక్షలలో వ్యూస్ వచ్చాయి.
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను చూసి మెస్మరైజ్ అయ్యి ” కొత్తతరం మొహమ్మద్ రఫీ కోసం మనం దశాబ్దాలు ఎదురుచూసాం.ఇక ఎదురుచూడనక్కర్లేదనుకుంటా! ఈ పాటను మార్చ బుద్ధి కావట్లేదు. అంటూ ట్వీట్ చేశారు.
మరి అందరినీ ఆకర్షిస్తున్న సౌరవ్ కిషన్ వాయిస్ లోని మ్యాజిక్ ను తెలుసుకోవడం కోసం మీరు కూడా ఈ వీడియో పై ఓ లుక్ వేయండి.
We have been waiting for decades for a new Mohammed Rafi. It sounds as if we may have to wait no longer… I couldn’t switch this clip off… https://t.co/QhM3koPlVE
— anand mahindra (@anandmahindra) September 12, 2020