ఎగువన కురుస్తున్న వర్షాలు, తెలంగాణలో వరదలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. లక్షకుపైగా క్యూసెక్కుల నీరు జలాశయానికి వచ్చి చేరుతోందని చెబుతున్నారు అధికారులు.
అంతకంతకూ వరదనీరు వస్తుండడంతో ప్రాజెక్ట్ 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దాదాపు లక్షా 15వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. జూరాల ప్రాజెక్టు గరిష్ట నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.611 టీఎంసీల నీటి నిల్వ ఉంది.