కింగ్‌కి కేటీఆర్ ట్వీట్మెంట్! - just about recovered viral fever king nagarjuna akkineni tweet tag ktr- Tolivelugu

కింగ్‌కి కేటీఆర్ ట్వీట్మెంట్!

వైద్య ఆరోగ్య శాఖకు బడ్జెట్లో తక్కువ కేటాయింపులు వున్నాయన్న విమర్శల్ని పట్టించుకోకుండా పరిసరాలు శుభ్రంగా వుంచుకోవాలంటూ చినజీయర్ స్వామిలా ధర్మోపన్యాసాలిస్తున్న మంత్రి కేటీఆర్.. ఈ క్రమంలో సినీ సెలబ్రిటీల్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నారు. కేటీఆర్ గారూ.. ఇదిగో చూడండి, మా ఇల్లు పరిసరాల్ని నేనెంత క్లీన్ చేసుకున్నానో… అంటూ కింగ్ నాగార్జున మినిస్టర్ గార్ని ట్యాగ్ చేస్తూ ఎంచక్కా ఓ ట్వీట్ కూడా చేశారు.

ఇప్పుడే వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్నానని చెప్పారు కింగ్ నాగ్. కానీ, ఒళ్లు నొప్పులు మాత్రం విపరీతంగా ఉన్నాయంటున్నారు. ఓ ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో డెంగీ ఫీవర్ విజృంభిస్తున్నాయి. తన ఇంటి పరిసరాలే కాకుండా తన అన్నపూర్ణ స్టూడియోస్‌లో మురికి నీటిని కూడా శుభ్రం చేసినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన పోస్టు చేశారు.

మురికి నీటి వల్ల దోమలు వృద్ధి చెందుతాయని, దీనివల్ల అనారోగ్య బారిన పడతామన్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచించి నాగ్.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఎలాంటి అపరిశుభ్రత వాతావరణం ఉండకూడదని సిబ్బందికి చెప్పానని తెలిపారు. మీ ఇల్లు, పనిచేస్తున్న ప్రదేశాల్లో మురికి నీటిని తొలగించాలంటూ నాగ్ ఓ మెసేజ్ ఇస్తూ  మంత్రి కేటీఆర్‌ని ట్యాగ్ చేశారు.

ఇటీవలే మంత్రి కేటీఆర్ ఇంటి పరిసర ప్రాంతాల్లో క్లీన్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటిని.. నీరు నిల్వ ఉండకుండా చేయాలని, క్లీన్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయాలని సూచించారు. దీంతో పలువురు నేతలు, ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన వారు వారి వారి ఇంటిని క్లీన్ చేసిన ఫొటోలను పోస్టు చేస్తూ సోషల్ మీడియాని కుమ్మేస్తున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp