వైద్యం కోసం లక్షల్లో వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల పేషంట్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాజాగా మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో ఇలాంటి దారుణం చోటుచేసుకుంది. గణేష్ నగర్ కాలనీలో గల శ్రీ హాస్పిటల్ లో గొల్ల బండ తాండాకు చెందిన రాజేశ్వరి గురువారం రాత్రి ప్రసవం కోసం హాస్పిటల్ లో చేరగా బాబుకి జన్మనిచ్చింది. డాక్టర్లు సరైన సమయంలో చికిత్స అందించకపోవడంతో తల్లి ,కొడుకు ఇద్దరు ఆసుపత్రిలోనే మరణించారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు చనిపోయిందని బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు హాస్పిటల్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన చిన్నారి మృతదేహన్నీ అట్టడబ్బా లో వేసి ఉంచడం ఆసుపత్రి నిర్లక్ష్యం అద్దం పడుతున్నాయని బంధువులు ఆరోపిస్తున్నారు.