మోడీ సర్కార్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అగ్నిపథ్ పథకాన్ని టార్గెట్ చేసుకుని కేంద్రంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
గత ఎనిమిదేండ్లుగా జై జవాన్- జై కిసాన్ లను బీజేపీ ప్రభుత్వం అవమానిస్తోందంటూ రాహుల్ మండిపడ్డారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి ఉంటుందని తాను గతంలోనూ చెప్పినట్టు ఆయన గుర్తు చేశారు.
ఇప్పుడు అగ్నిపథ్ స్కీం విషయంలోనూ అదే జరుగుతుంది. ఈ దేశ యువత డిమాండ్లకు కట్టుబడి ప్రధాని మాఫీ వీర్ గా మారి అగ్నిపథ్ ను వెనక్కి తీసుకోవాల్సి వస్తుందన్నారు.
అగ్నిపథ్ స్కీమ్ పై ఆయన శుక్రవారం సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ కేవలం ఆయన స్నేహితుల మాటలు మాత్రమే వింటారని, మరెవరి మాటా వినరని ఆయన ట్వీట్ చేశారు.