జస్టిస్ ఫర్ సుశాంత్..ఇప్పుడు ప్రపంచ సమస్యగా మారింది.. దేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల్లో తన అభిమానులు సుశాంత్ మరణానికి కారకులెవరో తెలియాలి, సుశాంత్ కుటుంబానికి న్యాయం జరగాలి అంటూ తమ తమ ధోరణుల్లో నిరసన తెలియచేస్తున్నారు..తాజాగా అమెరికాలో సుశాంత్ కి న్యాయం జరగాలంటూ బిల్ బోర్డ్స్ లో ప్రదర్శించారు.
సుశాంత్ మరణించినప్పుడు మలేషియా దేశస్తులు ఓపెన్ థియేటర్లో సుశాంత్ సినిమా ప్రదర్శించి సంతాపం తెలియచేయగా..ఇప్పుడు సుశాంత్ కి న్యాయం జరగాలంటూ కాలిఫోర్నియాలో వినూత్న ప్రదర్శన చేస్తున్నారు..కాలిఫోర్నియాలో కొన్ని ప్రాంతాల్లో Justice4sushanth అనే బిల్ బోర్డ్స్ దర్శనం ఇచ్చాయి.ఇందుకు సంబంధించిన విషయాలను సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది..880 నార్త్ లో ,గ్రేట్ మాల్ పార్క్ ఎవే ఎగ్జిట్ ప్రాంతంలో పెట్టిన బిల్ బోర్డ్ పోస్టుని శేర్ చేసిన కీర్తి.. “ఇది ఇప్పుడు ప్రపంచ వ్యాప్త సమస్య , వారియర్స్ ఫర్ ssr”అంటూ ట్యాగ్ చేసింది..
“వియ్ విల్ గెట్ ట్రూత్, వియ్ విల్ ఫైండ్ అవుట్..గాడ్ ఈజ్ విత్ అజ్” అంటూ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని శేర్ చేసింది శ్వేతా సింగ్ కీర్తి.. ప్రస్తుతం ఆ బిల్ బోర్డ్ సోషల్ మీడియాలో వైరలవుతోంది..దాంతో పాటు #warriors4ssr అనే హ్యాష్ టాగ్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు సుశాంత్ అభిమానులు..
ఇదిలా ఉండగా సుప్రిం ఆదేశంతో సుశాంత్ కేసు సిబిఐ చేతికి వెళ్లిన సంగతి తెలిసిందే..సిబిఐ ఛార్జ్ షీట్లో రియా మరియు కుటుంబ సభ్యులను నిందితులుగా చేర్చిన సిబిఐ వారిని విచారిస్తుంది.. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని సుశాంత్ కుటుంబ సభ్యులు , అభిమానులు నమ్ముతున్నారు..సిబిఐ దర్యాప్తులో ఏం బయటపడుతుందో చూడాలి..!