తెలంగాణ ఉన్నత న్యాయస్థానానికి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చీఫ్ జస్టిస్ తో ప్రమాణం చేయించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఆమె పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా గల హైకోర్టుల్లో ప్రస్తుతం మహిళా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి ఒక్కరే కావడం విశేషం.
ఢిల్లీలో 1959 సెప్టెంబరు 2న జన్మించిన హిమా కోహ్లి, ఢిల్లీ యూనివర్సిటీలో లా కోర్సు పూర్తి చేశారు. ఢిల్లీ హైకోర్టులో 2006 నుంచి న్యాయమూర్తిగా ఉన్నారు.