సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలపై ఆరోపణలు చేస్తూ సీఎం జగన్ సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయటం, ఆ లేఖను భయటకు లీక్ చేయటంపై ఎన్నో విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని కొందరు వాదిస్తుండగా.. సీఎం జగన్ పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది.
ఈ కేసు జస్టిస్ యూవీ లలిత్ దర్మాసనం ముందుకు రాగా, ఆయన విచారణ నుండి తప్పుకున్నారు. పిటిషన్ ను నాట్ బిఫోర్ మీ అని ప్రకటించి… కేసును చీఫ్ జస్టిస్ మరో దర్మసనంకు బదిలీ చేస్తారని ప్రకటించారు. పిటిషనర్ల తరుపున తను గతంలో వాదించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
సీఎం జగన్ పై లాయర్లు GS మణి, ప్రదీప కుమార్, ఎస్కే సింగ్ కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేశారు. ఆధారాలు లేకుండా సీఎం జగన్ ప్రజల ముందు, మీడియా ముందు సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ ఎన్ వీ రణమపై ఆరోపణలు చేశారని, ఆయన్నుపదవి నుండి తప్పించి తగు చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో ప్రస్తావించారు.