జువ్వ మూవీ రివ్యూ

మూవీ పేరు : జువ్వ
నటులు : రంజిత్, పలక్ లల్వానీ, పోసాని, ఆలీ, సప్తగిరి , అర్జున  తదితరులు
కథ, మాటలు : ఎం. రత్నం
చాయాగ్రహణం : సురేష్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : త్రికోటి పేట
నిర్మాత : డా. భరత్ సోమి
విడుదల : 23..2..18
ఓ సాధారణ ప్రేమకథ ఇది ! ఇద్దరి మధ్య రొమాన్స్, మధ్యలో విలన్.. చివరకు ఎన్నో మలుపులు తిరిగి సుఖాంతమవుతుంది. చిత్రాన్ని చిరంజీవి విడుదల చేయడం, కీరవాణి సంగీతం అందించడంతో ” జువ్వ ” మీద అంచనాలు పెరిగాయి. శుక్రవారం రిలీజైన ఈ చిత్ర కథ బ్రీఫ్ గా ..కాలేజీ రోజుల్లోనే శృతి (పలక్ లల్వానీ) ని ప్రేమిస్తున్నానంటూ  వెంట పడతాడు బసవరాజ్ పాటిల్..(అర్జున్) అయితే ఇలా చేయవద్దని, తప్పని మందలించిన టీచర్ ని హతమార్చి జైలుకెళ్తాడు. 14 ఏళ్ళు శిక్ష అనుభవించి మళ్ళీ శృతి కోసం వెదుకుతుంటాడు. ఈ క్రమంలో అనుకోకుండా దగ్గరైన రాణా (రంజిత్) కు శృతి బ్యాక్ గ్రౌండ్ తెలుస్తుంది. అప్పటికే ఆమె ప్రేమలో మునిగిన ఈ యువకుడు శ్రుతికి ఎదురైన ఆపదనుంచి గట్టెక్కించడానికి పూను కొంటాడు. ఈ ” లక్ష్యా ” న్ని ఎలా సాధించాడు ? బసవరాజ్ ను ఎలా అంతం చేశాడు లాంటి విషయాలు మూవీ చూసి తెలుసుకోవలసిందే.
కథ పాత చింతకాయ పచ్చడే.. ఫస్టాఫ్ కామెడీగా సాగగా, సెకండాఫ్ కాస్త సీరియస్ నెస్ సంతరించుకుని స్టోరీ హైదరాబాద్ నుంచి వైజాగ్ కు మారుతుంది. షార్ట్ స్టోరీ అయిన ఇందులో రంజిత్, పలక్ లల్వానీ ఓకె. పోసాని, అర్జున, సప్తగిరి తమ పాత్రలకు న్యాయం చేశారు. సంగీతం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వ్యాల్యూస్ ప్లస్ పాయింట్లు కాగా.. పాత కథే కావడం మైనస్ పాయింట్ అయింది. సెకండాఫ్ మందకొడిగా నడవడంతో  తేలిపోయింది.