సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం సిటీ మార్. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. గోపీచంద్ ఆంధ్ర మహిళా కబడ్డీ జట్టు కోచ్ గా, తమన్నా తెలంగాణ కబడ్డీ జట్టు కోచ్ గా నటించనుంది. కాగా వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కాగా ఈ సినిమాకు సంబంధించి జ్వాలా రెడ్డి పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అందుకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఈ రోజు రాత్రి 8 గంటలకు ఈ సాంగ్ ప్రోమో విడుదల కానుంది. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.