అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా ప్రయోగించిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు(జేడబ్ల్యూఎస్‌టీ) గమ్యస్థలాన్ని చేరింది. విశ్వం గుట్టు విప్పేందుకు ప్రయోగించిన జేడబ్ల్యూఎస్‌టీ నెలరోజుల తరువాత పలు కక్ష్యలను దాటుకొని రెండో లాంగ్రేంజ్ పాయింట్(ఎల్2)ను చేరుకుంది. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరం ప్రయాణింది.
ఇక అక్కడ సౌరకుటుంబం పుట్టుకను ఛేదించనుంది. గ్రహాలు, నక్షిత్రాలు వాటి రహస్యాలను తెలుసుకోనుంది. జేడబ్ల్యూఎస్‌టీ అక్కడి నుంచి ఖగోళానికి సంబంధించి విలువైన సమాచారాన్ని 5 నుంచి 10 ఏళ్ల పాటు మనకు పంపించనుంది. ఇది రెండో లాంగ్రేంజ్ పాయింట్(ఎల్2)ను చేరుకోవడం పై స్పందించిన నాసా విశ్వరహస్యాలను ఛేదించేందుకు చేపట్టిన మిషన్ కీలక మైలురాయిని చేరుకున్నామని తెలిపింది.
సౌరకుటుంబం గుట్టు విప్పేందుకు ఇంకో అడుగదూరంలో ఉన్నట్లు ప్రకటించింది. గత డిసెంబర్ 25న ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని గగనంలోకి పంపించారు. ఎరియాన్-5 రాకెట్ దీన్ని నింగిలోకి తీసుకెళ్లింది. విశ్వంపై సమాచారాన్ని తెలుసుకునేందుకు హబుల్ టెలిస్కోప్ రోదసీలో ఉంది.
ఇప్పుడు దాని స్థానంలోకి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడిన జేడబ్ల్యూఎస్‌టీని ప్రవేశపెట్టారు. ఈ ప్రాజెక్ట కోసం రూ.73 వేల కోట్లను ఖర్చు చేశారు. విశ్వం పుట్టుక గురించి పలు సిద్ధాంతాలు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట సక్సెస్ అయితే.. ఆ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది.