డ్రోన్ల ద్వారా ఔషధాల పంపిణీ మంచి మార్పునకు శ్రీకారమన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. వికారాబాద్ లో దేశంలోనే మొదటిసారిగా మెడిసిన్ ఫ్రమ్ ది స్కై కార్యక్రమాన్ని ప్రారంభించారాయన. తెలంగాణ మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు డ్రోన్లలో ప్రయోగాత్మకంగా మందులు, టీకాలు పంపించారు.
మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రారంభోత్సవం తర్వాత బీజేపీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు సిందియా. డ్రోన్లకు అనుమతులు, నిర్వహణను సులభతరం చేశామని చెప్పారు. విమానాయాన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని వివరించారు. వరంగల్, ఆదిలాబాద్ లో బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు సింధియా.