కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాని నిలుపుదల చేస్తూ హై కోర్ట్ ఆదేశాలు జారీచేసింది. ఈ సినిమా రెండు వర్గాల మధ్య వివాదాలు రెచ్చగొట్టే విదంగా ఉందని, వెంటనే సినిమాని నిలుపుదల చెయ్యాలని హైకోర్టు లో ఎన్నో పిటిషన్ లు దాఖలు చేశారు. మరో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా తనని అవమానపరిచే విదంగా చిత్రంలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు సినిమా విడుదల హై కోర్ట్ నిలుపుదలతో కేఏ పాల్ తనదైన శైలిలో స్పందించారు. నా ప్రేయర్ వల్లనే సినిమా ఆగిపోయింది. ఇప్పటికైనా వర్మ కు జ్ఞానం రావాలని, మంచి సినిమాలు తియ్యాలని ప్రార్థన చేద్దాం అంటూ కేఏ పాల్ కౌంటర్ ఇచ్చారు .