కళాతపస్వి కే విశ్వనాథ్ గారి గురించి ప్రత్యేకంగా భారతదేశ సినీ పరిశ్రమకు అవసరం లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకులలో ఈయన కూడా ఒకరు. గురువారం రాత్రి ఆయన అనారోగ్య సమస్యలతో స్వర్గస్తులైన విషయం తెలిసిందే. అయితే విశ్వనాథ్ వారసులు సినిమాలోకి రాకపోవడానికి కారణం ఏంటనే? ప్రశ్నకు అభిమానులలో చాలామందికి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో విశ్వనాథ్ మాట్లాడుతూ.. షాకింగ్ విషయాలను వెల్లడించడం గమనార్హం.
ఆయన ఒకానొక సమయంలో మీడియాతో మాట్లాడుతూ..” సినిమా వాళ్ళం పిరికి వాళ్ళమని కోట్ల రూపాయలతో బిజినెస్ చేస్తామని.. భయాలు సెంటిమెంట్ల వల్లే ఎస్ లెటర్ తో వరుసగా సినిమాలు చేశానని.. ఆయన కామెంట్లు చేశారు. ఆపద్బాంధవుడు సినిమాకు మాత్రం సెంటిమెంట్ ఫాలో కాలేదని ఆయన వెల్లడించారు. కథ రాసుకునే సమయంలో లిరిక్స్ కూడా నేనే రాస్తాను. అలా నేను రాసిన పల్లవులు సినిమాలలో ఉంచిన సందర్భాలు కూడా ఉన్నాయని విశ్వనాథ్ తెలిపారు.
కొన్ని పాటలు నేనే రాసాను అయితే పేరు మాత్రం వేసుకోలేదు. నేను పాటలు రాస్తాను అని తెలిపారు. నేను పాటలు రాశాను అంటే జనాలు నమ్ముతారో లేదో అని అనిపించింది అంటూ విశ్వనాథ్ కామెంట్లు చేశారు..పబ్లిసిటీ అనేది నచ్చదు.. నా కుటుంబ సభ్యులు సినిమాల్లోకి రావడానికి నేను వాళ్లను ప్రోత్సహించలేదు. అసలు నా కుటుంబ సభ్యులు ఇక్కడ రాణిస్తారని నమ్మకం కూడా నాకు లేదు.
ఈరోజుల్లో పైకి రావడం అంటే అంత సులభం కాదు.. టాలెంటును గుర్తించే విషయంలో అప్పట్లో చాలా మంది ఉండేవారు. అయితే మనీ విషయంలోనూ.. పేరు ప్రఖ్యాతలు విషయంలో ఇండస్ట్రీలో ఒక నిశ్చితి అనేది ఉండదు అంటూ విశ్వనాథ్ తెలిపారు. అందుకే మా పిల్లలను ఇండస్ట్రీలోకి తీసుకురాకుండా వేరే రంగాలలో స్థిరపడేలా చేశాను.. అంటూ కూడా ఆయన తెలిపారు. ఈ విషయాలు విన్న తర్వాత అభిమానులు కొంచెం బాధపడినా.. ఇండస్ట్రీలోకి వచ్చి ఫెయిల్యూర్ అవడం కంటే ఇదే బెటర్ అంటూ అభిప్రాయపడుతున్నారు.