ప్రగతి భవన్ ను పేల్చేయాలంటూ మంగళవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. రేవంత్ పై ఏకంగా డీజీపీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ.. ప్రగతి భవన్ ను తగలబెట్టాలన్న రేవంత్ వ్యాఖ్యలపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేశానన్నారు.
ఓటుకి నోటు కేసులో దొరికి ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నాడని విమర్శలు చేశారు. ఆయన ప్రజల కోసం పోరాడటం లేదన్నారు. ఈ మేరకు రేవంత్ పై పీడీ యాక్ట్ నమోదు చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఒక జూనియర్.. ఆయన్ని ఈ పదవి నుంచి తొలగించి సీనియర్ నాయకులకు ఇవ్వాలన్నారు పాల్.
అనంతరం సీఎం కేసీఆర్ పై కూడా కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రూ.500 కోట్లతో పాత సెక్రటేరియట్ కూలగొట్టి.. రూ.610 కోట్లు పెట్టి కొత్తది కట్టి డబ్బులు వృధా చేశారన్నారు. కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
సెక్రటేరియట్ అగ్ని ప్రమాదంపై సైతం సీబీఐకి కంప్లైంట్ చేశానని, కేంద్ర మంత్రులకు చెప్పినట్లు తెలిపారు. నూతన సచివాలయాన్ని అంబేద్కర్ జయంతి రోజున ప్రారంభం చేయాలని కోర్టులో పిల్ వేసినట్లు ఆయన గుర్తు చేశారు కేఏ పాల్.