కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాతో సంచలనం సృష్టిస్తున్న వర్మకు షాక్ ఇచ్చాడు కేఏ పాల్. చంద్రబాబు, నారాలోకేష్, పవన్ చెయ్యలేని పనిని కేఏ పాల్ చేసి చూపించారు. కమ్మరాజ్యం లో కడప రెడ్లు సినిమాలో చంద్రబాబు, లోకేష్, పవన్ లను చూపిస్తూ ఇండైరెక్ట్ పంచ్ లు వేస్తున్న ఈ ముగ్గురు ఎక్కడా నోరుమెదపలేదు. కానీ పాల్ మాత్రం వర్మ సినిమాని వ్యతిరేకిస్తూ హైకోర్టు లో పిటిషన్ వేశాడు.
సినిమాలో తనని అవమానించే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ పిటిషన్ లో పేర్కొన్నారు కేఏ పాల్. ఈ నెల 29 న విడుదలకు సిద్ధంగా ఉన్న కమ్మరాజ్యం లో కడప రెడ్లు సినిమా విడుదలని నిలిపివేయాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ కి ప్రతివాదులుగా కేంద్ర మంత్రిత్వ శాఖ ,సెన్సార్ బోర్డ్ ను, డైరెక్టర్ రాంగోపాల్ వర్మ, జబర్దస్త్ కమెడియన్ రామును చేర్చారు. మరి కాసేపట్లో ఈ పిటిషన్ విచారణకు రానుంది.