అక్టోబర్ 2న జరగాల్సిన గ్లోబల్ పీస్ ర్యాలీకి తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గాంధీ జాతిపిత అయితే.. కేసీఆర్ కూడా రాష్ట్రానికి జాతిపిత అని రాసుకోవడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆమరణ నిరాహారదీక్ష చేపడుతున్నట్లు కేఏ పాల్ తెలిపారు.
ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదన్నారు. పీస్ మీటింగ్కు ప్రముఖులు వస్తే తెలంగాణకి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండేదన్నారు. కానీ పర్మిషన్ ఇవ్వకపోవడం దారుణమన్నారు వ్యాఖ్యానించారు కేఏ పాల్.
తెలంగాణను దోచుకున్నది చాలక ఇప్పుడు.. జాతీయ పార్టీతో దేశాన్ని దోచుకోవడానికి కేసీఆర్ వెళ్తున్నాడని కేఏ పాల్ విమర్శించారు. మునుగోడు ప్రజలు బాగా ఆలోచించి.. అభివృద్ధి చేసే పార్టీకే ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ తెలంగాణను అవినీతి రాష్ట్రంగా మార్చారని ఆగ్రహించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.
ప్రపంచ శాంతి కోసం అక్టోబర్ 2న గ్లోబల్ పీస్ ర్యాలీ, ఎకనామిక్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు కేఏ పాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో జరపనున్నట్లు ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించి బుధవారం బేగంపేట టూరిజం ప్లాజాలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, జస్టిస్ చంద్రకుమార్, గద్దర్, కాంగ్రెస్ నేతలు మల్లు రవి, వీహెచ్, విమలక్కలతో కలిసి పోస్టర్లను రిలీజ్ చేశారు.