మునుగోడు ఉప ఎన్నికల్లో శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 199 మంది నామినేషన్లు వేశారు. దీంతో శనివారం స్క్రూట్ ని ప్రక్రియ నిర్వహించారు. నల్గొండ జిల్లా చుండూరు రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఈ స్క్రూట్ ని జరగబోతోంది. అయితే ఈ స్క్రూట్ నీకి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ కేసీఆర్ ఆధ్వర్యంలో నడుస్తుందని విమర్శలు చేశారు.
సీఎం కేసీఆర్ కమ్యునిస్ట్ లను కొనేశారన్నారు. బీజేపీకి బీ పార్టీగా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ పెట్టాడన్నారు. అభివృద్ధి చేయనందుకే గల్లి గల్లీకి ఓ కీలక నేతను బరిలోకి దింపారన్నారు. బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడం కంటే టీఆర్ఎస్ పార్టీలో ఉండటమే బెటర్ అన్నారు. రేవంత్ కూడా ఆర్ఎస్ఎస్ ఏజెంట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా నా తర్వాత వచ్చిన వారిని లోపలికి పంపించారన్నారు. ఒక వేళ నా నామినేషన్ తిరస్కరిస్తే ఎన్నికనే జరగదు.. జరగనివ్వనని ఆయన స్పష్టం చేశారు. ఓటర్లకు పది తులాల బంగారం ఇచ్చినా తీసుకుని ప్రజా శాంతి పార్టీని గెలిపించాలని ఆయన కోరారు.
మునుగోడులో నన్ను ప్రజలు గెలిపిస్తే ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు రుణమాఫీ, మంచినీరు, కాలేజీలు, రోడ్లు ఆరు నెలల్లో చేసి చూపిస్తామని కేఏ పాల్ హామీ ఇచ్చారు. మునుగోడు ప్రజలు తెలివితేటలు వాడి ఇచ్చిన డబ్బు తీసుకుని నన్ను గెలిపించాలని ప్రజలను కోరారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.