తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన సచివాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాద ఘటనపై.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సోమవారం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ ప్రమాదంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా తాను దాఖలు చేసిన వ్యాజ్యాలను విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారని మంగళవారం మసారి చీఫ్ జస్టిస్ ని కోరినట్లు పాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సెక్రటేరియట్ ను క్రైమ్ జోన్ గా గుర్తించాలని, సీజ్ చేసి విచారణ జరపాలని కోరానన్నారు.
జరిగిన సంఘటన ప్రమాదవ శాత్తు జరిగిందా? లేక అక్కడ ఏమైనా నరబలి జరిగిందా? అనేదానిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాల్ దాఖలు చేసిన పిల్ కు నెంబరింగ్ ఇవ్వాలని రిజిస్టార్ కి చీఫ్ జస్టిస్ ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
అలాగే సెక్రటేరియట్ ప్రారంభోత్సవం కేసీఆర్ పుట్టిన రోజు కాకుండా అంబేద్కర్ పుట్టిన రోజు ప్రారంభోత్సవం చేయాలని మరో పిల్ కూడా వేసిన నేపథ్యంలో ఈ రెండు వ్యాజ్యాలు గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.