తెలంగాణ సీఎం కేసీఆర్ ను లక్ష్యాంగా చేసుకుని విమర్శలు చేసే కేఏ పాల్.. ఈ సారి తన రూట్ మార్చారు. ఈసారి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసుకొని వరుసగా ఆయనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న పవన్ కళ్యాణ్.. బైబిల్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శలు చేశారు పాల్. జనసేన పార్టీని వదిలి ప్రజాశాంతి పార్టీలో చేరాలని సూచించారు. జనసేన నుండి పోటీ చేసినా.. మరే పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసినా గెలడని వ్యాఖ్యానించారు.
ప్రజాశాంతి పార్టీలో చేరితే ఎమ్మెల్యే గానో, ఎంపీ గానో తానే దగ్గరుండి గెలిపిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ గెలవకపోతే రూ. 1000 ఇస్తానని బంపర్ ఆఫర్ ప్రకటించారు.
అయితే.. గతంలోనూ పవన్ పై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోశారు కేఏ పాల్. పవన్ కల్యాణ్ ఓ ప్యాకేజ్ స్టార్ అంటూ ఆరోపణలు చేశారు. నిన్నా, మొన్నటి వరకు కేసీఆర్, జగన్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ పాల్.. తాజాగా పవన్ పై ఘాటుగా స్పందిస్తున్నారు.