తనకున్న చారిటీలను కరోనా బాధితుల చికిత్స నిమిత్తం వాడుకోవచ్చని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆఫర్ ఇచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాధి లక్షణాలతో వందల సంఖ్యలో జనాలు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. ప్రజల కష్టాలను అర్ధం చేసుకుని సంగారెడ్డిలో 300 పడకల సామర్థ్యమున్న చారిటీ సిటీ, విశాఖలో 100 పడకల గదులు ఉన్నాయని తెలిపిన ఆయన, వాటిని వాడుకుంటే తనకు ఒక్క రూపాయి కూడా అద్దె చెల్లించనక్కర లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించిన ఆయన, దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేయాలని అన్నారు.