వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు కేఏ పాల్. సూర్యాపేట జిల్లాలో కేకే పాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే ప్రజాశాంతి పార్టీ ధ్యేయమన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. పింఛన్లు అందక లబ్ధిదారులు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు.
దేశాన్ని ప్రధాని మోడీ సీఎం, కేసీఆర్ తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ప్రపంచంలో రెండో ధనికుడు అదాని అది ఎలా సాధ్యపడిందని పాల్ ప్రశ్నించారు. లక్షల కోట్లు అప్పు చేసే కేసీఆర్ కావాలా? లేక లక్షల కోట్లుతీసుకొచ్చే కేఏ పాల్ కావాలో తేల్చుకోవాలన్నారు.
ఈవీఎంలు వద్దు బ్యాలెట్ బాక్స్ లే ముద్దంటూ వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ, దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్, నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ అమలును కేసీఆర్ తుంగలోకి తొక్కారన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెచ్చిన MNC కంపెనీలు తప్ప.. కొత్త కంపెనీలను సీఎం జగన్ తీసుకురాలేదని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లాలో ల్యాండ్, సాండ్ మాఫియా హవా కొనసాగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్.