ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. మెడికో ప్రీతి కేసు, ప్రభుత్వ వైఫల్యాలపై తాను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ వస్తున్నానని చెప్పారు. అందుకే తనను టార్గెట్ చేశారన్నారు.
అందుకే తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. తనపై వున్న తప్పుడు కేసును ఇప్పుడు మళ్లీ రీ ఓపెన్ చేశారన్నారు. అది తప్పుడు కేసు అని గతంలో కేసీఆర్ ఖండించారన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ కుట్రలు చేస్తున్నారంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు.
స్టే విధించిన మహబూబ్‌నగర్ కేసును రీ ఓపెన్ చేశారన్నారు. తనను మహబూబ్‌నగర్ పంపిచాలని చూస్తున్నారన్నారు. అక్కడ తన అన్నయ్యను చంపిన టీమ్ ద్వారా తనను హత్య చేయించేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు
గతంలో తనను వైఎస్ రాజశేఖర్ రెడ్డి జైల్లో పెట్టించి హత్య చేసేందుకు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా అలానే కుట్రలు చేస్తున్నారన్నారు. తనపై ఉన్న కేసు చట్ట విరుద్ధమని హైకోర్టు స్టే ఇచ్చిందని చెప్పారు.