కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు
నేను గత 40 రోజుల నుంచి ప్రజలకు ఎల్లపుడూ అందుబాటులో ఉన్నాను. భవిష్యత్ లో ఉంటాను. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాటం చేస్తా. తెలంగాణలో ప్రజల కొరకు పోరాడుతున్నాను. పోరాడుతూనే ఉంటాను. మా మీటింగ్ పెట్టనివ్వకుండా పోలీసుల్ని వాడుకుని ఆపేయడం దళిత జాతిపై కేసీఆర్ కు ఎంత చిన్నచూపో అర్థం అవుతోంది. కేసీఆర్ నిజస్వరూపం ప్రజలకు తెలియాలి. ఆయన తెలంగాణ ద్రోహి.
కేసీఆర్ పాలన ఇంకా కొనసాగే అర్హత లేదు. టీఆర్‌ఎస్ రాజ్యసభకి నామినేట్ చేసిన ముగ్గురు కూడా డబ్బులు కుమ్మరించి పదవులు పొందినవారే. 1200 వందల మంది తెలంగాణ కోసం అమరులయ్యారు. వారి కుటుంబల నుంచి నామినేట్ చేయాలని అనిపించలేదా? మాల, మాదిగ, ఐఏఎస్, ఐపీఎస్ లు కనపడలేదా? రాజ్యసభ పొందినవారు ఒక్కొక్కరు రూ.500 నుంచి రూ.1,000 కోట్లు ఇచ్చి పదవి తీసుకున్నారు. రాజ్య సభ అంటే అర్ధం తెలియని వాళ్ళని అక్కడకు పంపుతున్నారు.
ఒకరు మైనింగ్ డాన్ రవిచంద్ర, మరొకరు రూ.500 కోట్ల స్కామ్ లో పట్టుబడిన పార్థసారధిరెడ్డి, గచ్చిబౌలిలో భూకబ్జాలు చేసిన దామోదర్ రావును ఎంపిక చేస్తారా? కరోనా కష్టకాలంలో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుకున్న పార్థసారధిని రాజ్యసభకి పంపండి దేనికి నిదర్శనం. అక్రమాలు, అవినీతి పాలనను ప్రశ్నించేందుకు, తెలంగాణను అప్పుల నుంచి విడిపించి బంగారు తెలంగాణ చేయడమే నా లక్ష్యం.
ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రాజ్యసభకు ఎంపిక చేసిన ముగ్గురిని విత్ డ్రా చేయించి… అమరవీరుల కుటుంబాలకు సీట్లు ఇవ్వాలి. మైనింగ్ ట్యాక్స్ లు ఎగ్గొట్టిన మైనింగ్ డాన్ రవిచంద్రకు రాజ్యసభ సీటు కేటాయింపా? దుబాయ్ డాన్, పాకిస్థాన్ డాన్, బొంబాయి డాన్ అని ఒకాయన్ని అంటారు. దావూద్ ఇబ్రహీంకు రాజ్యసభ సీటు ఇస్తే ఇంకా బాగుండేది కదా. పెద్ద డాన్ మిమ్మల్ని కాపాడుతాడు. గచ్చిబౌలిలో 300 ఎకరాల భూ ఆక్రమణ కేసులో ఏ-1 ముద్దాయిగా ఉండటమేనా దామోదర్ రావు రాజ్యసభ సీటుకు అర్హత.