ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవ్వడం ఖాయమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మార్చి 10న కవిత అరెస్ట్ అవుతుందని.. ఇదే కేసీఆర్ పతనానికి ఆరంభం మాత్రమేనన్నారు. 8 ఏళ్లుగా రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేశాడని అన్నారు కేఏపాల్. బీఆర్ఎస్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని అన్నారు. కేవలం ఓట్ల కోసమే పథకాలు తీసుకొచ్చి తర్వాత విస్మరించారని దుయ్యబట్టారు.
తెలంగాణ రైతులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల కన్నీరు ఉసురు కేసీఆర్ కుటుంబానికి తాకిందన్నారు. దేవుడినే శతృవును చేసుకున్న కేసీఆర్ ఫలితం అనుభవిస్తాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్.