ప్రముఖ దర్శకురాలు లీనా మణిమేఖలై కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. తాజాగా ఆమె నిర్మిస్తున్న డాక్యుమెంటరీ చిత్రం ‘కాళీ’ కి సంబంధించిన పోస్టర్ ను ఆమె విడుదల చేశారు.
తాజాగా దీనిపై వివాదం మొదలైంది. ఈ పోస్టర్‌లో కాళీమాత వేషధారణలో ఉన్న నటి ఒక చేతితో త్రిశూలం పట్టుకోగా, మరో చేత్తో సిగరేట్ తాగుతున్నట్టు కనిపిస్తోంది.
ఇంకో చేతిలో ఎల్ జీబీటీ జెండాను పట్టుకున్నట్టు పోస్టర్ ను సినిమా బృందం రూపొందించారు. కాళీమాతను ఇలా కించ పరుస్తూ చూపించడంపై హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
హిందువుల మనోభావాలను దెబ్బతీసిన లీనాను అరెస్టు చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటి ఆమెపై దేశ వ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్లలో హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి.