విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంత,నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం కత్తువాకుల రెండు కాదల్. కాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ యూట్యూబ్‌లో విడుదలైన ఒక రోజులోనే ఏడు మిలియన్ల వ్యూస్ సంపాదించింది.
మొదట టీజర్ కు మూడు మిలియన్ల వ్యూస్ రాగానే… అధిక ప్రేమ & ప్రశంసలు 3 3 3 అని చెప్తూనే 3 గంటల్లో 3 మిలియన్లు: 300,000 మంది ఇష్టపడ్డారు అంటూ చెప్పుకొచ్చాడు.
అంతే కాదు ఈ టీజర్ చూసిన ఇతర దర్శకులు కూడా విఘ్నేష్ శివన్‌ను ప్రశంసించారు. దర్శకుడు రాజేష్ ఎం సెల్వ, విఘ్నేష్ శివన్‌ను అభినందిస్తూ అద్భుతమైన టీజర్ బ్రదర్.. అంచనాలు భారీగా పెరుగుతున్నాయి! ఎక్స్‌ట్రీమ్ ఆర్టిస్ట్ విజయ్ సేతుపతి, సమంతా రూత్ ప్రభు, నయనతార కోసం ఎదురుచూస్తున్నారు. మీ మొత్తం టీమ్‌కి అభినందనలు అంటూ ట్వీట్ చేశాడు.
ఇక ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి చూడాలి విజయ్ సేతుపతి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటుందో.