కచ్చాబాదం అనే పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పాటపాడిన వ్యక్తి రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయాడు.ఆ కచ్చాబాదం పాటను యూట్యూబ్ లో షేర్ చేసినందుకు ఒక కంపెనీ రూ.3 లక్షలు ఇచ్చారు.
అయితే ఇందుకోసం సదరు కంపెనీ తనను కొన్ని పేపర్స్ మీద సంతకం పెట్టించుకుని నా ముందర కాళ్ళకు బంధాలు వేసారని ఆ కచ్చాబాదం గాయకుడు వాపోతున్నాడు.ఇప్పుడు గాయకుడికి తగిలిన గాయమేంటో పూర్తిగా తెలుసుకుందాం.
బండ్లు ఓడలవుతాయన్నసామెత అందరికీ తెలిసిందే.. కాలం కలిసి వస్తే అదృష్టం అందలం ఎక్కిస్తోంది.. ఎవరు ఎప్పుడు పెద్ద స్టార్ అవుతారో చెప్పలేం.
ముఖ్యంగా సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత రోడ్డుమీద వ్యాపారం చేసుకునే వ్యక్తి కూడా హఠాత్తుగా సెలబ్రెటీ అయిపోతున్నాడు.
అలాంటి వ్యక్తుల్లో ఒకరు వేరుశనగలు అమ్మే వ్యక్తి…అవును కచ్చా బాదం పాటతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన సింగర్ భుబన్ బద్యాకర్ ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడట.
వివరాల్లోకి వెళ్తే..సైకిల్ మీద తిరుగుతూ కచ్చా బాదం పాట పాడుతున్న వీడియో నేటికీ వైరల్ అవుతూనే ఉంది. ఆ సాంగ్ ను మళ్లీ మళ్ళీ వింటూ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.
తాను మోసపోయానని.. ఇప్పుడు తన సాంగ్ ను తాను సొంతంగా పాడలేక పోతున్నా అంటూ భుబన్ బద్యాకర్ వాపోతున్నాడు.అయితే కాపీరైట్ విషయంలో తాను మోసపోయానని సింగర్ చెబుతున్నాడు. యూట్యూబ్‌లో తన పాటను షేర్ చేసినందుకు ఒక కంపెనీ రూ.3 లక్షలు ఇచ్చారు.
అయితే ఇందుకోసం సదరు కంపెనీ తనను కొన్ని పేపర్స్ మీద సంతకం పెట్టమని చెప్పడంతో సంతకం పెట్టానని కానీ అది తన ముందరకాళ్ళకు బంధంగా మారుతుందని తనకు తెలియదని ఆ కచ్చాబాదం గాయకుడు తన బాధను వెళ్ళగక్కాడు.
ఆ పేపర్ చాలా గజిబిజిగా ఉంది.. ఇలా సంతకం పెడితే తాను భవిష్యత్ లో ఇబ్బందులు వస్తాయని తనకు తెలియదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను చదువుకోలేదు.. ఇంగ్లీష్ చదవడం కూడా తెలియదని చెప్పాడు.
అయితే ఆ సంస్థ నా పాట కొనుక్కున్నట్లు చెబుతోంది. మాట్లాడడం కూడా మానేసింది. తాను కాపీరైట్ సమస్య కారణంగా…తన పాటలను తాను పాడలేను లేదా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయలేను..ఇలా ఎంతకాలం ఉండాలో తెలియదంటూ చెప్పుకొచ్చాడు.