కడప జిల్లా రాజంపేట మండలం తాళ్ళపాక విఆర్వో రాఘవేంద్ర ఆత్మహత్య యత్నం చేశారు. చెయ్యి మణి కట్టు కోసుకుని సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పై అధికారి సోమవారం జరిగిన ఓటియస్ సర్వే పై తీవ్రంగా మందలించడంతో మనస్తాపం చెందిన రాఘవేంద్ర ఆత్మహత్య యత్నం చేశాడు.
సోమవారం రాత్రి రాజంపేట తాసీల్ధార్ కార్యాలయం వద్ద ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విపరీతంగా రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నం చేయగా రాఘవేంద్ర ఒప్పుకోలేదు. అనంతరం ఎర్రబెల్లి లోని తన ఇంటికి తరలించారు.
Advertisements
ఆ సమయంలో కూడా బాధిత వీఆర్వో రాఘవేంద్ర వైద్యానికి నిరాకరించారు. రాఘవేంద్ర తో పాటు మరికొంత మంది అధికారులు కూడా ఒత్తిళ్ళతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.