కడప : భూమాతకు ఆగ్రహం వచ్చిందని జనం వెళ్లి చూసొస్తున్నారు. 150 అడుగుల మేర కిందకు కుంగిపోయిన భూమిని చూసి ఆశ్చర్చపోతున్నారు. మూడేళ్లకు ఒకసారి ఇలా ఎందుకు జరుగుతోందోనని కలవరపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కడప నగరం శివారు ప్రాంతంలో వున్న బయనపల్లి, ఇప్పపెంట గ్రామాల్లో భూమి బాగా లోతుకు కుంగిపోయింది. రోజు మాములుగానే వుండే ప్రదేశంలో అకస్మాత్తుగా భూమి పెద్ద గుంటగా మారిపోవడంతో చుట్టుపక్కల జనం భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి వింతగా చూసి వెళ్తున్నారు. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇలా గుంతలు పడి వుంటాయని అధికారులు చెబుతున్నా సమీప ప్రాంతాల జనం భయపడుతున్నారు. మూడేళ్ల ముందు ఇలానే జరిగిందని, ఈ ప్రాంతంలో ఇది మొదటిసారి కాదని కొంతమంది చెబుతున్నారు.