విశాఖపట్నం తెన్నేటి పార్క్ వద్ద పెను ప్రమాదం తప్పింది. వర్షం కారంగా పార్క్ కి ఎదురుగా ఉన్నటువంటి కైలాసగిరి కొండచరియలు విరిగిపడి రోడ్డు మీదకి వచ్చాయి. సంఘటన జరిగిన సమయానికి ఆ ప్రదేశంలో ఎవ్వరు లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డు మీదకు పెద్ద పెద్ద బండ రాళ్లు రావటంతో వాహాన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు బండరాళ్లను తొలిగించే పనిలో పడ్డారు.
మరో వైపు యారాడ మార్గంలో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. పర్యాటకాన్ని తిలకించేందుకు అటువైపుగా నిత్యం రాకపోకలు సాగించే యాత్రికులకు అంతరాయం ఏర్పడడంతో జీవీఎంసీ షహాయక చర్యలను చేపట్టింది. మరో వైపు ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పురాతనమైన తొట్లకొండ బౌద్ధ స్థూపం సైతం కూలిపోయింది.