చిన్న పొరపాటు అతన్ని జైలుపాలు చేసింది. అతను ఖైదు కాగలిగాడు గాని, గొంతులోని ఆ మాధుర్యాన్ని ఎవరు ఖైదు చేయగలరు. కొమ్మ చాటు కోయిల కచేరీ చేసినట్టుగా, జైలుగోడల నుంచే పాటందుకున్నాడతను. ఇప్పుడీ పాట దేశవ్యాప్తంగా ఎంతో మందిని ఆకట్టుకుని వైరల్ గా మారింది.అతనికి పాడే అవకాశం తెచ్చిపెట్టింది. బిహార్ లోని కైమూర్ కు చెందిన కన్హయ్య రాజ్. మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తిచాడన్న కారణంగా భబువా రోడ్ రైల్వేస్టేషన్ పోలీసులు అతడిని అరెస్టు చేసారు.
ఒక రోజు జైలులో ఉన్న కన్హయ్యం రాజ్..ఓ భోజ్ పురి పాటతో ఇంటర్నెట్ లో పాపులారిటీ సంపాదించుకున్నాడు. జైలులో పాట పాడుతుండగా పోలీసులు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసారు.
కైమూర్ జిల్లా, రామ్ గడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దహ్రక్ గ్రామంలో నివసిస్తున్నాడు. జైలులో పాడిన కన్హయ్య వీడియో చూసినవాళ్ళంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అద్భుతంగా పాడావంటూ మెచ్చుకుంటున్నారు.
వీడియో వైరల్ అయిన తర్వాత తనకు అనేక అవకాశాలు వచ్చాయని కన్హయ్య చెబుతున్నాడు. తాగిన మత్తులో ఇతరులకు ఇబ్బంది కలిగించారన్న ఆరోపణలతో భబువా రోడ్ రైల్వే స్టేషన్ పోలీసులు కన్హయ్యను అరెస్ట్ చేసారు.
ఒకరోజు జైలులో ఉంచి విడుదల చేసారు. అయితే,ఈ ఆరోపణలను కన్హయ్య కొట్టిపారేసారు. తాను మద్యం సేవించడం వల్ల అరెస్టు కాలేదని తనపాటలో అశ్లీలత ఉందని తప్పుగా భావించి ఎవరో ఫిర్యాదు చేసారని చెప్పాడు. తనది పేద కుటుంబమని, తన తండ్రి, సోదరుడు కూలిపని చేసుకుంటున్నారని కన్హయ్య చెబుతున్నాడు.
పదోతరగతి పాస్ అయ్యి తాను 2018 లో పాటలు పాడటం మొదలుపెట్టానని చెప్పాడు. వీడియో వైరల్ అయిన తర్వాత పాట పాడేందుకు బెనారస్ కు రావాలని అవకాశం వచ్చిందని తెలిపాడు.