చందమామ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన బ్యూటీ కాజల్. దశాబ్దం కాలం పాటు అగ్రహీరోలు సరసన నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి హీరోగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తుంది. మరో వైపు కమల్ హాసన్ భారతీయుడు 2లో కూడా నటిస్తోంది. కేరిర్ మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన కొంత కుదురుకున్న తర్వాత నటనకు ప్రాధాన్యమున్న సినిమాలతో అభిమానుల్ని సంపాదించుకుంది కాజల్.
ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ లు లేకపోవటంతో ఇంటికే పరిమితం అయ్యింది కాజల్. వంటిట్లో రకరకాల వంటలు చేస్తూ వాటిని తన ఫ్యామిలీతో కలిసి ఆరగించేస్తోంది. దీనికి సంబందించిన ఓ ఫోటోను కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తెలుగు వంటకాల్నీ చాలా మిస్ అవుతున్నాను షూటింగ్‌లో ఉంటే అవి చాలా ఇష్టంగా తినేదాన్ని కానీ కరోనా వల్ల షూటింగ్ బంద్ అవ్వడంతో తనకు ఇష్టమైన బెండకాయ పులుసు, పెసరట్టు, సోరకాయ పచ్చడి వంటల్నీ చేశానని చెప్పింది. దీనికి సంబందించిన పిక్స్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంది.