తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఎదిగి… ఇటీవల కాస్త వెనకబడ్డ హీరోయిన్ కాజల్. ఇండస్ట్రీలో టాప్ హీరోలందరి సరసన నటించి మంచి పేరు తెచ్చుకున్న కాజల్… ప్రస్తుతం శంకర్ నిర్మిస్తోన్న భారతీయుడు-2లో నటిస్తోంది. కమల్ హసన్ జంటగా నటించనున్న కాజల్… ఈ సినిమాలో 82 ఏళ్ల బామ్మగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నుండి తదుపరి షూటింగ్ జరగబోతున్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి రోల్‌లో ఎప్పుడూ తాను నటించలేదని, ఇలాంటి ఛాలెంజింగ్ రోల్‌లో నటించాలని… తన తదుపరి చిత్రాలు కడూఆ ఇదే విధంగా ఉండేలా చూసుకుంటున్నట్లు ప్రకటించింది. భారతీయుడు-2 సినిమా గురించి నేను ఎక్కువగా చెప్పలేను, ఏం చెప్పినా చిత్ర యూనిట్ నన్ను చంపేస్తుంది అంటూ నవ్వేసింది.
శంకర్ దర్శకత్వంలో కమల్ హసన్ భారతీయుడు-2 చిత్రం చేస్తున్నారు. గతంలో భారతీయుడు సినిమాతో అవినీతిపై తీసిన సినిమా సూపర్ హిట్ కావటంతో… ఆ సినిమాకు సీక్వెల్‌గా భారతీయుడు-2 రాబోతుంది.