కాజల్ అగర్వాల్.. 15 ఏండ్లుగా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమె త్వరలో తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్ అయినప్పటి నుంచి ఆమె బేబీ బంప్ నకు సంబంధించినవంటూ పలు ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఆమె తన ఇన్ స్టా హ్యాండిల్ లో షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ఆమె తన భర్త గౌతమ్ కిచ్లూ, పెంపుడు కుక్క పక్కన ఉండగా కడుపులోని బిడ్డ బయటకు ఏర్పడేలా ఫోజు ఇచ్చింది.
దీనికి ఇది మనం(దిస్ ఈజ్ అజ్) అని క్యాప్షన్ పెట్టింది. దీనిపై పెద్ద ఎత్తున లైక్ లు వస్తున్నాయి. ఈ పోస్టుపై ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ స్పందించారు. వీ లవ్ దిస్ ఈజ్ అంటూ కామెంట్ పెట్టారు.
మరో వైపు ఆచార్య మూవీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్దేలో పాటు ఆమె కూడా నటిస్తున్నారు.