తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది కాజల్ అగర్వాల్. కాజల్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఇకపోతే ఈమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ తల్లిగా తన కొడుకు, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
మాతృత్వం కోసం సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుంది కాజల్ అగర్వాల్. కాజల్ 2020లో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించాడు. మాతృత్వం కోసం సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్న కాజల్ అగర్వాల్ ఇప్పుడిప్పుడే సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది.
ఈ నేపథ్యంలోనే కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా కాజల్ అగర్వాల్ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకుంది. తాజాగా తిరుపతికి చేరుకున్న కాజల్ శ్రీవారిని వీఐపీ బ్రేక్ దర్శనంలో దర్శించుకుంది.
ఇక టీటీడీ అధికారులు కాజల్ కి దగ్గరుండి దర్శనం అలాగే ఇతర సౌకర్యాలు కల్పించారు. కాజల్ మొదటిసారిగా తన కొడుకుని తీసుకొని శ్రీవారిని దర్శించుకుంది. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆమె కి తీర్థ ప్రసాదలను అందించారు.కాజల్ స్వామివారిన దర్శించుకుని బయటకు వస్తున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.