హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. అయితే ఈ అమ్మడు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. 21 మిలియన్ల మంది ఫాలోవర్లను సాధించింది. ఇదే విషయాన్ని చెబుతూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
నా ఇన్‌స్టా కుటుంబానికి చెందిన 21 మిలియన్ల మంది ప్రేమకు ధన్యవాదాలు. నేను మిమ్మల్ని 21 మిలియన్ సార్లు తిరిగి ప్రేమిస్తున్నాను అంటూ రాసుకొచ్చింది.
ఇక కొత్తగా పోస్ట్ చేసిన ఫోటోలలో కాజల్ రెడ్ లెహంగాలో కనిపించింది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితమే, బాడీ షేమింగ్ పై కామెంట్స్ చేసే వారికి వార్ణింగ్ ఇస్తూ ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలు తమ శరీరంలో జరిగే మార్పులను ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని గురించి కాజల్ చెప్పుకొచ్చింది.
ఇక సినిమాల విషయానికి వస్తే కాజల్ నటించిన హే సినిమాకా సినిమారిలీజ్ కు సిద్ధంగా ఉంది. దుల్కర్ సల్మాన్, అదితి రావు హైదరీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది.