తెలుగులో టాప్ హీరోయిన్ గా వెలుగొంది, క్రమంగా కనుమరుగవుతున్న హీరోయిన్ కాజల్. మరోవైపు పక్కా కమర్షియల్ అనే సినిమాలో గోపిచంద్ హీరోగా దర్శకుడు మారుతీ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి పనిచేయబోతున్నారు. అయితే కాజల్ గోపిచంద్ సినిమాలో నటించటం లేదు. మారుతీ లాక్ డౌన్ లో వెబ్ సిరీస్ కోసం కొన్ని కథలు రాసుకున్నాడు. అందులో ఒ కథకు కాజల్ ను పిక్ చేసుకున్నాడని టాక్.
3రోసెస్ అనే టైటిల్ తో త్వరలో ఈ వెబ్ సిరీస్ పట్టాలెక్కనుంది. కాజల్ లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్ తో డిస్నిప్లస్ హాట్ స్టార్ ద్వారా డిజిటల్ డెబ్యూట్ చేసింది. కాజల్ చిరంజీవి ఆచార్యలో హీరోయిన్ గా నటించింది.